ఏపీ ప్రజలు డిసైడ్ అయిపోయారు.. బై బై బాబు అని చెప్పాల్సిన సమయం వచ్చేసింది!: ప్రశాంత్ కిశోర్

  • ఏపీ ప్రజల నమ్మకాన్ని బాబు కోల్పోయారు
  • ఇప్పుడు నకిలీ వార్తలు వ్యాప్తి చేస్తూ దిగజారిపోయారు
  • ఏపీ సీఎంపై ట్విట్టర్ లో మండిపడ్డ జేడీయూ నేత
రెండేళ్లుగా తాము పడ్డ కష్టం వృథా అయిపోతోందని, ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతోందంటూ వైసీపీ ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరిట ఓ ట్వీట్ ప్రచారంలోకి వచ్చింది. ప్రభుత్వం ఏర్పరిచేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ వస్తుందని కచ్చితంగా చెప్పలేమని, జగన్ పార్టీతో కలిసి పని చేయడం జీవితంలో మర్చిపోలేని దారుణ సంఘటనగా అభివర్ణిస్తూ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.

అయితే, ఈ ట్వీట్ తాను చేసింది కాదని ప్రశాంత్ కిషోర్ ఈ రోజు స్పష్టం చేశారు. ఆ నకిలీ ట్వీట్ ను ఖండిస్తూ ఆయన ఓ ట్వీట్ చేశారు. ఏపీ ప్రజల నమ్మకం, విశ్వాసం కోల్పోయిన సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు అంతలా దిగజారిపోయారని దుయ్యబట్టారు. పోలింగ్ ముగియడానికి మరికొన్ని గంటలే ఉన్నప్పటికీ తమ తీర్పు ఏమిటో ఏపీ ప్రజలు డిసైడ్ చేసేశారని వ్యాఖ్యానించారు. ‘బైబై బాబు’ అని చెప్పాల్సిన సమయం ఆసన్నమయిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ప్రశాంత్ కిశోర్ ట్వీట్ చేశారు.







Go Back to Shorts
Andhra Pradesh
YSRCP
PRASHANT KISHORE
Telugudesam
Chandrababu
Twitter
BYE BYE BABU

More Telugu News